లాలూకు బెయిల్‌ మంజూరుకు సుప్రీం తిరస్కరణ

lalu prasad yadav
lalu prasad yadav


న్యూఢిల్లీ: బీహార్‌ మాజీ సియం, ఆర్జేడి చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దాణా కుంభకోణం కేసుల్లో జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఆయనకు బెయిల్‌ మంజూరు చేసేందుకు సుప్రీం తిరస్కరించింది. అనారోగ్యంతో ఉన్నానని, తనకు బెయిల్‌ మంజూరు చేయమని లాలూ కోర్టును గతంలో అభ్యర్ధించారు. ఆ పిటిషన్‌పై సుప్రీం స్పందిస్తూ బెయిల్‌పై మిమ్మల్ని విడుదల చేయాలన్న ఆలోచన మాకు లేదు అని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో లాలూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలున్నాయంటూ నిన్న ఆయన బెయిల్‌ పిటిషన్‌ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన రాంఛీ ఆస్పత్రిలో గత ఎనిమిది నెలలుగా అక్కడి నుంచే రాజకీయాలు కొనసాగిస్తున్నారని సిబిఐ ఆరోపించింది.
ఎన్నికల కోసం లాలూ తన బెయిల్‌ను దుర్వినియోగం చేయవచ్చంటూ గట్టిగా వాదించింది. లాలూ ప్రవర్తనను బట్టి ఆయనకు ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సిబిఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఆయనకు బెయిల్‌ తిరస్కరించినట్లు ప్రకటించింది.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/