ఎన్‌కౌంటర్‌పై విచారణ బాధ్యత సుప్రీం మాజీకి..?

supreme court
supreme court

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలైన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సత్వర విచారణకు తీసుకోవాలన్న న్యాయవాది జీఎస్‌ మణి వినతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. దీనిపై జస్టిస్‌ బాబ్డే స్పందిస్తూ హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌పై పూర్తి అవగాహనతో ఉన్నామని చెప్పారు. ఈ ఘటనపై జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోనే ఉండి ఆయన ఈ కేసును దర్యాప్తు చేసేలా చూస్తామని తెలిపారు. దర్యాప్తుపై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జస్టిస్‌ బాబ్డే ఆదేశించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/