ట్రిపుల్‌ తలాక్‌ చట్టం సమీక్షకు సుప్రీం అంగీకారం

త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

supreme court
supreme court

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ బిల్లును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. ట్రిపుల్ తలాఖ్ చట్టం అపరిమితంగా ఉండడమే కాక అత్యంత కఠినంగా ఉందన్న కారణాలతో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ముస్లిం మహిళా(వివాహానికి సంబంధించిన హక్కుల పరిరక్షణ) చట్టం, 2019గా వ్యవహరిస్తున్న ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్లను పరిశీలిస్తాతమని జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం పిటిషనర్లలో ఒకరి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్‌కు తెలిపారు.అంతేకాక దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/