కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

జనవరి మూడవ వారం లోపు కొత్త చట్టం తీసుకురావాలని ఉత్తర్వులు

shabari
shabari

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల కనుమల్లో నెలకొన్న అయప్పస్వామి ఆలయ నిర్వహణకోసం కొత్త చట్టాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శబరిమల ఆలయంపై పండలమ్ రాయల్ ఫ్యామిలీ తమ హక్కులను పరిరక్షించాలంటూ వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. వచ్చే ఏడాది జనవరి మూడవ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అన్ని ఆలయాలను కలిపి ఒకే చట్టం కిందకు తీసుకురావడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల ఆలయాన్ని ప్రత్యేకంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. భక్తుల సౌకర్యాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది.
తాజా బిజినెస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/