అక్రమ నివాసదారులకు జూలై నెలాఖరే చివరి గడువు

refuees
refuees

గువహటి: 2003 చట్టంలోని 5వ నిబంధన ప్రకారం విదేశాల నుంచి వచ్చి అస్సాంలో నివసిస్తున్న వారిని అక్రమ నివాసం ఉంటున్న వారిగా గుర్తించి వారిని తిరిగి పంపించేందుకు ప్రభుత్వ వర్గాలు పనిచేస్తున్నాయి. నేషనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ డ్రాఫ్ట్‌ ప్రకటించిన కొత్త జాబితాలో సుమారు లక్ష మందికి అగ్ని పరీక్ష ఎదురైంది. మొత్తం 1,02,462 మంది తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి జూలై నెలాఖరు చివరి గడువు. దీంతో ఆ జాబితాలో ఉన్నవారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు.
వాస్తవానికి సుప్రీం ఆదేశాలు కూడా ఈ ఏడాది జూలై నెలాఖరు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆదేశాలు ఉన్నాయని, దీని ప్రకారమే తాము నూతన జాబితా రూపొందించినట్లు జాబితా రూపకర్తలు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/