అసమ్మతి ఎమ్మెల్యెల విచారణ రేపటికి వాయిదా

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: కర్ణాటక అసమ్మతి ఎమ్యెల్యెలు తమ రాజీనామాలు ఆమోదించడం లేదంటూ 10 మంది రెబల్స్ ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అయితే దీని తర్వాత మరో ఐదుగురు అసంతృప్త ఎమ్మెల్యులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్ల గురించి రెబల్స్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ నేడు సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
ఆ 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌తో పాటే వీరి పిటిషన్లను కూడా విచారించాలని న్యాయస్థానాన్ని ముకుల్‌ రోహత్గీ కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. ప్రధాన పిటిషన్‌తో పాటే ఈ ఐదుగురి పిటిషన్లను కూడా రేపే విచారిస్తామని సుప్రీంకోర్టు నేడు వెల్లడించింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/