లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా సంతోష్‌ గంగ్వార్‌?

Santosh Gangwar
Santosh Gangwar


న్యూఢిల్లీ: బిజెపి సీనియర్‌ మోస్ట్‌ లోక్‌సభ సభ్యుడు సంతోష్‌ గంగ్వార్‌ని 17వ లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా నియమించే అవకాశాలున్నాయి. అయితే మేనక గాంధీ కూడా ఆయనతో సమానమైన సీనియారిటీ కలిగి ఉన్నారు. అయితే, మేనక గాంధీని కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉండటంతో గంగ్వార్ నియామకం దాదాపు ఖాయమైనట్టేనని చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఎనిమిది పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా, ఒకవేళ మోడి మంత్రివర్గంలో మేనక గాంధీతో పాటు గంగ్వార్ కూడా చోటు దక్కిన పక్షంలో ఆ తర్వాత ప్రోటెం స్పీకర్ అర్హత కలిగిన వారిలో కేరళ కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేష్ ఉన్నారు. పార్టీతో నిమిత్తం లేకుండా సీనియారిటీ ఆధారంగా ప్రోటెం స్పీకర్‌గా తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


తాజా సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/