మీర్జాపూర్‌ జిల్లాలో దారుణమైన ఘటన

Children at Mirzapur primary school
Children at Mirzapur primary school

మీర్జాపూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో చిన్నారులకు పోషకాహారం సరిగా అందట్లేదు. మధ్యాహ్న భోజనం పేరుతో కేవలం రొట్టెలు, కూరకు బదులుగా ఉప్పు వేసి ఇస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, రొట్టె, కూరగాయాలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం ఇవ్వాలని అధికారులు ఈ పథకం తీసుకొచ్చారు. అయితే మీర్జాపూర్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇవేవీ ఇవ్వకుండా కేవలం రొట్టెలు మాత్రమే పెడుతున్నారు. కనీసం కూర కూడా వండకుండా ఉప్పుతో తినమంటున్నారు. ఒకరోజు ఉప్పు, రొట్టెలు.. మరుసటి రోజు అన్నం, ఉప్పు ఇలా వారమంతా ఇదే భోజనం అందిస్తున్నారు. గత ఏడాది కాలంగా ఈ స్కూల్లో పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారు. పాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చినా వాటిని పిల్లలకు ఇవ్వరు. ఇక అరటిపండ్లు ఇంతవరకూ పంచలేదుగఅని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీ సూపర్‌వైజర్‌, స్కూల్‌ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు తేలడంతో వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేశామని అధికారులు వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/