మరోసారి రాబర్డ్‌ వాద్రాకు ఈడీ పిలుపు

Robert Vadra
Robert Vadra

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్డ్‌ వాద్రా గత కొంత కాలంగా అక్రమాస్తుల కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ పేర్కొంది. వాద్రాను ఈడీ విచారణకు పిలువడం ఇది తొమ్మిదవసారి రేపు ఉదయం 10.30 గంటలకు ఈడీ విచారణకు వాద్రా హాజరుకావాలి. లండన్‌, దుబాయ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ఆస్తుల విషయమై రాబర్ట్‌ వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/