నాపేరు తొలగించే వరకు విచారణకు సహకరిస్తాను

Robert Vadra
Robert Vadra

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్డ్‌ వాద్రా ఈరోజు ఈడీ కార్యాలయానికి చేరుకొనున్నారు. ఆయన నగదు అక్రమ చలామణి, అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే వాద్రాను ఇప్పటికే ఈడీ దాదాపు 70 గంటల పాటు ప్రశ్నించింది. నేడు లండన్‌, దుబాయ్‌, రాజస్థాన్‌, ఎన్‌సీఆర్‌ పరిధిలో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఈడీ ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ అక్రమ ఆస్తుల కేసులో విచారణకు హాజరు కావడం ఇది తొమ్మిదోసారి. ఇప్పటి వరకు నేను 11 సార్లు 70 గంటలపాటు విచారణకు హాజరయ్యాను. భవిష్యత్తులో కూడా వస్తాను. ఈ అక్రమ కేసుల నుంచి నా పేరు తొలగించే వరకు నేను విచారణకు సహకరిస్తాను. అని వాద్రా నేడు తన ఫేస్‌ బుక్‌లో పోస్టు చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/