ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

road accident
road accident

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌హ్ర‌యిచ్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. అతి వేగంతో వ‌చ్చిన ట్ర‌క్కు ఎదురుగా వ‌స్తున్న కారును ఢీకొన్న సంఘ‌ట‌న‌లో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. ఈమేర‌కు జిల్లా ఎస్పి గౌర‌వ్ గ్రోవ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌హ్ర‌యిచ్ జిల్లాలో గురువారం ఉద‌యం వేగంగా వ‌స్తున్న ట్ర‌క్కు ఒక ఎస్‌యూవీ వాహ‌నాన్ని ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో ఎస్‌యూవీ కారులో ప్ర‌యాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌ర‌ణించిన వారిలో ధ‌ర్మేంద్ర (45), వీరేంద్ర (55), సురేష్ (45), ఆశిష్ (12), రాంబాబు (19), కారు డ్రైవ‌ర్ అర్మాన్ (35) లు ఉన్నారు. కాగా సురేష్, ఆశిష్ తండ్రీ, కొడుకులు కావ‌డం గ‌మ‌నార్హం. బాధితులు వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యేందుకు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే డ్రైవ‌ర్ ప‌రార‌వ‌గా.. ట్ర‌క్కును సీజ్ చేసి, విచార‌ణ చేప‌ట్టామ‌ని పోలీసులు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/