టిక్‌ టాక్‌ యాప్‌ను తొలగించమని కేంద్రం ఆదేశాలు

Tik Tok app
Tik Tok app

న్యూఢిల్లీ: టిక్‌ టాక్‌ యాప్‌ తొలగించాలని మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్‌ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే టిక్‌ టాక్‌ యాప్‌ను ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌, యాపిల్‌ సంస్థలను ఆదేశించిందిఈ యాప్‌ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియాకు సూచించింది. చిన్న పిల్లలు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్‌ 16లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు మేరకు చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం తాజా ఆదేశాలను జారీ చేసింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/