సత్యం కేసులో ప్రైస్‌వాటర్‌ కూపర్స్‌కు ఊరట

sebi
sebi

సెబీ రెండేళ్ల నిషేధాన్ని ఎత్తివేసిన శాట్‌


న్యూఢిల్లీ: సంచలనం కలిగించిన సత్యం ఐటి కంపెనీ కుంభకోణంలో సెబీ ఆదేశించిన ఉత్తర్వులను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ కొట్టివేసింది. ఒకవిధంగా ఈ ఉత్తర్వులు సెబీ నిబద్ధతను ప్రశ్నించినట్లేనని చెప్పాలి. సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ట్రిబ్యునల్‌ ప్రైస్‌వాటర్‌కూపర్స్‌పై విధించిన రెండేళ్ల సెబి నిషేధాన్ని ఎత్తివేసింది. శాట్‌ సెబీ కి ఈ అధికారాలు లేవని, ఆడిట్‌, ఆడిట్‌సేవల ప్రామాణికాలను పరిశీలించే అధికారాఉ ఎంతమాత్రం లేవని ఝలక్‌ ఇచ్చింది. సత్యం ఐటి కంపెనీలో 7800 కోట్ల నిధుల అవకతవకలు బయటపడిన అంశం తెలిసిందే. సోమవారం శాట్‌ మార్కెట్‌పర్యవేక్షణసంస్థ సెబీ ఉత్తర్వులను తిప్పికొట్టింది. అయితే ఆడిటర్‌ణుంచి 13కోట్ల రూపాయల ఫీజులను మాత్రం శాట్‌ పాక్షికంగా అంగీకరించింది. ఈ స్కాంలోనే ఆనాడు రామలింగరాజు ప్రమోట్‌చేసిన సత్యం కంపెనీ 2009లో పెద్ద ఎత్తున సంచలనం కలిగించడంతోపాటు ఐటి రంగాన్ని ఓకుదుపు కుదిపింది. సంస్థను ఆడిట్‌చేసిన ప్రైస్‌వాటర్‌కూపర్స్‌పై సెబీ రెండేళ్లపాటు నిషేధం విదించింది.

పిడబ్ల్యుసి న్రపపంచ వ్యాప్తంగా అతిపెద్ద నాలుగు అకౌంటింగ్‌ సంస్థల్లో ఒకటి. కేవలం జాతీయ స్థాయి ఆడిటర్లు ఐసిఎఐ వంటి సంస్థలు మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉందని, మోసాలను ఆడిటింగ్‌ నిర్లక్ష్యంద్వారా నిరూపించలేరని శాట్‌ అభిప్రాయపడింది. సెబీకి ఆడిట్‌, ఆడిట్‌షేవల నాణ్యతను పరిశీలించే అధికారాలులేవని, సెబీ కేవలం ఇందుకు సంబంధించి నివారణ, నిర్మూలన కార్యాచరణను మాత్రమే తీసుకోగలదని శాట్‌ వాదించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/