లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న జడెజా భార్య!

PM Modi , Ravindra Jadeja's wife Rivaba Jadeja
PM Modi , Ravindra Jadeja’s wife Rivaba Jadeja

జామ్‌నగర్‌: క్రికెటర్‌ రవీంద్ర జడెజా భార్య రివాబా జడెజా రాబోయే లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆమె ఇటివలే బిజెపిలో చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సీటు ఆశిస్తున్నారు. కాగా ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తమ అభ్యర్థిగా పాటిదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ను బరిలోకి దించాలని యోచిస్తోంది. దీంతో జామ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. గుజరాత్‌లోని కర్నిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న రివాబా.. క్షత్రియ వర్గీయుల మద్దతుతో ఈ నెల మొదటివారంలో బిజెపిలో చేరారు. నేడు బిజెపి లోక్‌సభ భ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/