ఆర్థిక రంగంలో ఆరో స్థానం

RAVI SANKAR PRASAD
RAVI SANKAR PRASAD

ఆర్థిక రంగంలో ఆరో స్థానం

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

హైదరాబాద్‌: భారత్‌ ఆర్థిక రంగంలో ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచిందని, మన్మోహన్‌ హాయం లో 11 స్థానంలో ఉండేదని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భారత్‌ కే మన్‌కి భాత్‌, మోదీకి సాథ్‌ పేరిట కార్యక్రమాలు చేశారన్నారు. బిజెపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి ప్రతి పౌరుడి వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశాలు అన్నారు. నూతన భారత దేశంలో అభివృద్ధి కోసం పౌరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తు న్నామన్నారు.