యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: ఈరోజు రాజ్యసభ చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) సవరణ బిల్లు (యుఏపీఏ)కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై సభలో చర్చ అనంతరం డివిజన్ పద్ధతిలో ఓటింగ్‌ను చైర్మన్ వెంకయ్యనాయుడు నిర్వహించారు. సవరణ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. దీంతో రాజ్యసభలో బిల్లు నెగ్గింది. యూఏపీఏ సవరణ బిల్లును స్థాయీ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్ వీగిపోయింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 104 మందిసభ్యులు, అనుకూలంగా 85 మంది సభ్యులు ఓటు వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/

Please follow us on Twitter and like Our Facebook page to get more updates on your social network