శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాజ్‌నాథ్‌కు ఆహ్వానం


స్వయంగా కలిసి ఆహ్వానపత్రిక అందించిన సుబ్బారెడ్డి

subba reddy- rajnath singh
subba reddy- rajnath singh

న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి వార్షిక ఉత్సవాల్లో ముఖ్యమైన బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ఆహ్వానించారు. నిన్న ఆయన ఢిల్లీ వెళ్లి రాజ్‌నాథ్‌కు ఇందుకు సంబందించిన ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు. ఈనెల 29వ తేదీ రాత్రి ఏడు గంటలకు అంకురార్పణ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో టీటీడీ చేపడుతున్న సంస్కరణలను రక్షణ మంత్రి కొనియాడారని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/