ఫ్రాన్స్‌ పర్యటనకు బయలుదేరిన రాజ్‌నాథ్‌

8న భారత్‌కు తొలి రాఫెల్‌ యుద్ధ విమానం

rajnath-singh
rajnath-singh

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మూడు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్‌ బయలుదేరారు. ఫ్రాన్స్‌ నుండి భారత వాయుసేన కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్‌ యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని స్వీకరించడానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ పర్యటకు వెళ్లారు. అయితే భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవమైన అక్టోబర్ 8న ఫ్రాన్స్ భారత్‌కు తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందజేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొని, తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని అందుకుంటారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్‌కు చెందిన అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/