నిఘా నీడలో మన సముద్ర మార్గం సురక్షితంగా ఉంది

ఏ దేశంపైనా భారత్ దాడికి పాల్పడలేదు

Rajnath Singh
Rajnath Singh

న్యూఢిల్లీ: ఏ దేశంపైనా భారత్ దాడికి పాల్పడలేదని, ఎన్నడూ ఇటువంటి తప్పులు చేయలేదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఢిల్లీలో నేవీ అధికారులతో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… పరాయి భూమిని అంగుళం కూడా భారత్ బలవంతంగా లాక్కోలేదని, అయితే, దేశాన్ని తప్పుడు దృష్టితో చూసేవారికి తగిన గుణపాఠం చెప్పే సామర్థ్యం మన సాయుధ బలగాలకు ఉందని వ్యాఖ్యానించారు. భారత నావికా దళ నిఘా నీడలో మన సముద్ర మార్గం సురక్షితంగా ఉందని రాజ్ నాథ్ తెలిపారు. ముంబయి దాడుల వంటి ఘటనలు మరోసారి చర్యలు తీసుకుంటోందన్నారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/