రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫైని ఎత్తివేస్తున్నాం

భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలు చవకగా మారాయి

google-station-free-wi-fi-india-project-end-mobile-data-more
google-station-free-wi-fi-india-project-end-mobile-data-more

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్యేస్టేషన్‌లలో అందిస్తున్న ఉచిత వైఫైను గూగుల్‌ ఎత్తివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై గూగుల్‌ ఉపాధ్యక్షుడు సీజర్‌ గుప్తా స్పందిస్తూ..ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలు చాలా చవకగా మారిపోయాయి. అందువల్లనే దక్షిణాఫ్రికా, నైజీరియా, థా§్‌ులాండ్‌, ఫిలిప్పిన్స్‌, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్‌ దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను ఎత్తివేస్తున్నామని తెలిపారు. ఐదేళ్ల క్రితం గూగుల్‌ స్టేషన్లు ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటా వాడకం సులభతరంగా, చవకగా మారింది. మొబైల్‌ డేటా ప్లాన్లు చాలా తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయి. 2015లో భారతీయ రైల్వే, రైల్‌టెల్‌ భాగస్వామ్యంతో గూగుల్‌ వేగవంతమైన, ఉచిత పబ్లిక్‌ వైఫై సేవలను ఆరంభించింది. కాగా మొబైల్‌ కనెక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‌లో మొబైల్‌ డేటా లభ్యమవుతుంది. ఐదేళ్ల క్రితం పోలిస్తే మొబైల్‌ డేటా ధర 95 శాతం తగ్గింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్‌ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసు ఎత్తివేత నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/