కేరళలో పర్యటిస్తున్నారాహుల్

Rahul Gandhi
Rahul Gandhi

కేరళ: కేరళలో  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటిస్తున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాల్పెట్టలో రాహుల్ మాట్లాడుతూ.. తను కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ.. వయనాడ్‌లోని ప్రతి ఒక్కరికీ తమ తలుపులు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. సిద్ధాంతాలకు అతీతంగా, వారి ప్రాంతంతో సంబంధం లేకుండా.. వయస్సు చూడకుండా అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. కేరళ ఎంపీగా కేవలం వయనాడ్ సమస్యలనేగాక రాష్ట్ర సమస్యలను లోక్‌సభలో ప్రస్తావిస్తానన్నారు.