రాహుల్‌ రాజీనామా వార్తలను ఖండించిన కాంగ్రెస్‌

rahul-gandhi
rahul-gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ పార్టీ కొట్టిపారేసింది. అయితే రాహుల్‌ రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం కొనసాగుతోందిగ అని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నేడు భేటీ అయ్యింది. ఈ సమావేశానికి రాహుల్‌ గాంధీ సహా, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు గలాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/