ఆయన ఫిరంగి అయితే నేను ఏకే 47

Navjot Singh Sidhu
Navjot Singh Sidhu

సిమ్లా: పంజాబ్‌ మంత్రి. కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రఫెల్‌ ఒప్పందానికి మోడి బ్రోకర్‌గా పనిచేస్తున్నారేమోనని ఆయనని నిలదీయాలనుకుంటున్నాను. నాతో ఆయన దేశంలో ఎక్కడైనా చర్చల్లో పాల్గొనవచ్చు అని మోడికి సవాలు విసిరారు. ఈ చర్చల్లో నేను విఫలమయితే రాజకీయాలను నుండి తప్పుకుంటానని సిద్దూ అన్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్‌లో గెలుపు పట్ల ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అయితే ఆయన ఫిరంగి అయితే నేను ఏకే 47 అని సిద్దూ అన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/