వారిద్దరూ ఊహల్లో జీవిస్తుంటారు

దేశ ఆర్థిక స్థితిని ఉద్దేశించి రాహుల్ విమర్శలు

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోడి, అమిత్‌షాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. వారిద్దరూ ఊహల్లో జీవిస్తుంటారని ఆయన ఎద్దేవా చేశారు. వారి ఊహల ప్రపంచంతో తప్ప… బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు ఉండవని విమర్శించారు. వారి సొంత ప్రపంచంలో విహరిస్తూ… వివిధ అంశాలపై భ్రమల్లో తేలిపోతుంటారని అన్నారు. అందుకే మన దేశం ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెప్పారు. దేశ ఆర్థిక స్థితిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/