రాహుల్‌ ప్రధాని అయ్యే అవకాశమే లేదు

Maneka Gandhi
Maneka Gandhi

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బిజెపి సీనియర్‌ నాయకురాలు మేనకా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎప్పటికి దేశ ప్రధాని కాలేరని అన్నారు. ఎదైనా అద్భుతం జరిగితే తప్ప రాహుల్‌ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ అమేథీ, వయానంద్‌ నుండి పోటీచేయడం ఆమె స్పందించారు. ఎన్నికల్లో ఎవరైనా రెండు సీట్లలో లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల నుండి పోటీ చేయెచ్చని ఆమె పేర్కొన్నారు. అంతేకాక లోక్‌ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రభావం ఏమీ ఉండదని ఆమెకు కార్యకర్తల బలం లేదని తెలిపారు. సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేశారు. నా భర్త సంజయ్‌ గాంధీ రెండు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్‌ గాంధీ గెలుపొందారు. ఈసారి నాతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సారి కూడా విజయం మాదే. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీబీఎస్పీ కూటమితో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తామే మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నామన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిపై మేనకా మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/