మళ్లీ రాహులే.. ఏక వాక్య తీర్మానం

Congress' top leaders meeting
Congress’ top leaders meeting

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు సమావేశమైన వర్కింగ్ కమిటీ ఏమీ తేల్చలేకపోయింది. ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గే వంటి నేతల పేర్లు కొత్త అధ్యక్షుడి రేసులో బలంగా వినిపించినా, వర్కింగ్ కమిటీ సభ్యులందరూ రాహుల్ గాంధీ వైపే మొగ్గుచూపారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని మించిన సమర్థుడు మరొకరు లేరని, మత తత్వ పార్టీలు దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని నడిపించడంతో పాటు దేశాన్ని రక్షించగల సత్తా ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకే, రాహులే మళ్లీ రావాలంటూ సీడబ్ల్యూసీ ఏకవాక్య తీర్మానం చేసింది.

అయితే, తమ నిర్ణయంపై రాహుల్ ఏమంటాడోనన్న అంతర్మధనంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాత్రి 8 గంటలకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/