పుల్వామా దాడి చేసిన రషీద్‌ ఆచూకీ తెలిసింది!

pulawama attack
pulawama attack

జమ్మూ: పుల్వామా దాడిలో సూత్రధారి అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ ఆచూకీ చిక్కినట్లు సమాచారం. అతడు పుల్వామా లేదా ట్రాల్ అడ‌వుల నుంచి అత‌ను దాడిని ఆప‌రేట్ చేసిన‌ట్లు గుర్తించారు. పాక్‌కు చెందిన ఉగ్ర‌వాది మౌలానా మ‌సూద్ అజ‌హ‌ర్ ఆదేశాల ప్ర‌కార‌మే.. అబ్దుల్ ర‌షీద్ పుల్వామా దాడికి ప్లానేసిట్లు అనుమానిస్తున్నారు.షీద్‌ను ప‌ట్టుకునేందుకు సైనికులు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.పుల్వామాలో కారు బాంబుతో ఆత్మ‌హుతి దాడికి పాల్ప‌డిన అదిల్ అహ్మ‌ద్ దార్ జైషేకు చెందిన వ్య‌క్తి. అత‌ను ఆ బృందంలో సీ క్యాట‌గిరీ ఉగ్ర‌వాది. భార‌తీయ భ‌ద్ర‌తా ద‌ళాలు గ‌త కొన్నాళ్లుగా అత‌నిపై నిఘా పెట్టాయి. కారు బాంబు దాడి ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతం నుంచి ఎన్ఐఏ అధికారులు కీల‌క స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారు. జైషే సంస్థ‌కు చెందిన క‌మ్రాన్‌.. ఉగ్ర‌దాడికి పూర్తి ప్లాన్ వేసిన‌ట్లు చెబుతున్నారు.