పుదుచ్చేరి సియం ధర్నా విరమణ

kiran bedi, narayana swami
kiran bedi, narayana swami

పుదుచ్చేరి: లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడి తీరును వ్యతిరేకిస్తూ ఆమె ఇంటి (రాజ్‌నివాస్‌) ముందు ధర్నా చేపట్టిన పుదుచ్చేరి సియం వి.నారాయణస్వామి సోమవారం అర్దరాత్రి ధర్నా విరమించారు. గవర్నర్‌తో సియం 4 గంటల పాటు చర్చలు జరిపిన అనంతరం సియం ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లు పాక్షికంగా నెరవేరాయని అందుకే ధర్నా విరమించినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 20,21న చేపట్టవలసిన జైల్‌ భరో, నిరాహార దీక్షను రద్దు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో కొన్నింటిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించారని సియం నారాయణస్వామి తెలిపారు. ఐతే పుదుచ్చేరికి రాష్ట్ర హోదాపై తమ ఆందోళన కొనసాగుతుందపి ఆయన పేర్కొన్నారు.
ప్రజల సౌకర్యార్ధం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించట్లేదని, ఆమెను వెంటనే రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గతవారం సియం ఆందోళనకు దిగారు.