ఆ చాపర్‌లో ఎక్కడం చాలా గర్వంగా ఉంది

Priyanka Gandhi , Woman Pilot
Priyanka Gandhi , Woman Pilot

న్యూఢిల్లీ: ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ సిక్రీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆమె చాపర్‌లో వెళ్లారు. అయితే ఆ చాపర్‌లో మహిళా పైలట్‌ను ఉండటం చూసి ప్రియాంక చాలా ఆనందపడ్డారు. ఆమెతో వెంటనే సెల్ఫీ తీసుకున్నారు. అంతేకాక ‘ఓ మహిళ నడిపిన లోహవిహంగంలో ఎక్కడం ఎంతో గర్వంగా ఉంది. అది కూడా చాపర్‌లోగ అని ప్రియాంక ట్వీట్ చేశారు. నిన్న ఫతేపూర్‌ సిక్రీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ బిజెపిపై విరుచుకుపడ్డారు. ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్యం పట్ల గానీ ప్రజల పట్ల గానీ బీజేపీకి విశ్వాసం ఉన్నట్టు కనిపించడంలేదని, వాస్తవిక మార్గం నుంచి ఆ పార్టీ పక్కకు జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు. దేశం కోసం, యువత సంక్షేమం కోసం బీజేపీ ఏమి చేసిందో చెప్పకుండా పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నదని విమర్శించారు. వాస్తవిక పరిస్థితులపైనే దేశం ఆధారపడిందని, ఆ మార్గం నుంచి వైదొలిగినవారిని ఎవరూ క్షమించరని బీజేపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/