ప్రియాంక గాంధీని అడ్డుకున్న పోలీసులు..

నా భార్యను చూసి గర్వపడుతున్నాను: రాబర్ట్‌ వాద్రా

robert vadra & priyanka gandhi
robert vadra & priyanka gandhi

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ తలపెట్టిన పర్యటన తీవ్ర పరిణామాలకు దారితీసింది. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనల్లో అరెస్టయిన విశ్రాంత ఐపీఎస్‌ దారపురి కుటుంబాన్ని కలిసేందుకు ప్రియాంక గాంధీ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో లోహియా ప్రాంతంలో పోలీసులు ఆమె వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తనను ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రియాంక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నాపై చేయి చేసుకున్నారని ప్రియంకా ఆరోపించారు. కాగా దీనిపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా పోలీసులు ప్రియాంకపై చేయి చేసుకున్న తీరు పట్ల నేను చాలా బాధపడ్డాను అని అన్నారు. ఒక మహిళా పోలీసు ప్రియంక గాంధీ గొంతును పట్టుకున్నారన్నారు. మరోకరు ఆమెను నెట్టేయడంతో ఆమె కిందపడింది అని అన్నారు. అయినప్పటికీ ప్రజల వద్దకు వెళ్లాలనే ఆమె నిర్ణయించుకంది. ప్రజల పట్ల ప్రియాంక గాంధీ చూపుతోన్న ప్రేమ, తన అవసరం ఉన్న చోటుకి ఆమె వెళ్తున్న తీరు పట్ల తాను గర్వపడుతున్నానని రాబర్ట్‌ వాద్రా తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/