మహాకాలేశ్వరుడికి ప్రియాంకా ప్రత్యేక పూజలు

Priyanka Gandhi at Ujjain's Mahakal temple
Priyanka Gandhi at Ujjain’s Mahakal temple

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగం క్షేత్రం ఉజ్జయిని మహాకాలేశ్వరుడికి కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శ ప్రియాంకా గాంధీ వద్రా ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలోపల ప్రియాంకా శివార్చ‌న‌లు చేశారు. గ‌త ఏడాది కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ఉజ్జ‌యిని మ‌హాకాలేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు. ప్రియాంక వెంట ఆ రాష్ట్ర సీఎం క‌మ‌ల్‌నాథ్ కూడా వెళ్లారు. ఈసంద‌ర్భంగా ఆ రాష్ట్ర మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. అధికారంలోకి వ‌స్తే ప‌ది రోజుల్లోనే రైతుల‌కు రుణ‌మాఫీ క‌ల్పిస్తామ‌న్నారు, కానీ ఇంత‌వ‌ర‌కు క‌మ‌ల్‌నాథ్ ప్ర‌భుత్వం ఆ ప‌నిచేయ‌లేద‌ని శివ‌రాజ్ ఆరోపించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/