కార్యకర్తలకు ప్రియాంక వార్నింగ్‌!

priyanka gandhi
priyanka gandhi

లక్నో: యూపిలోని రాయ్‌బరేలిలో కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంక గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపై ఆమె కొన్ని విమర్శలు చేశారు. కార్యకర్తల వల్లే పార్టీ విజయం సాధించలేకపోయిందని, తాను ఎప్పుడూ నిజాలు మాట్లాడుతానని, తన మాటలు కఠినంగా ఉంటాయంటూనే ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేయని కార్యకర్తలను గుర్తించనున్నట్లు ఆమె చెప్పారు. ఎక్కడైనా మతపరమైన ఉద్దేశంతో పనిచేసిన వారి గురించి తెలుసుకాని, పార్టీ గురించి పనిచేయని కార్యకర్తల గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నానని అన్నారు. యూపిలోని రాయ్‌బరేలిలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ నెగ్గింది. అమేథీ నుంచి రాహుల్‌ ఓడిన సంగతి తెలిసిందే.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/