ఉన్నావో బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసిన ప్రియాంకా

ఆ కుటుంబానికి న్యాయం కోసం పోరాడతామన్న ప్రియాంక

Priyanka Gandhi
Priyanka Gandhi

ఉత్తరప్రదేశ్‌: కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా ఈరోజు ఉన్నావో అత్యాచార బాధితురాలి ప్రాంతానికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయంపై బాధితురాలి వదిన మీడియాతో మాట్లాడారు. ‘మా కుటుంబానికి న్యాయం జరగడం కోసం, మాకు మద్దతుగా పోరాడతానని ప్రియాంకా గాంధీ తెలిపారు. మా డిమాండ్ ఒక్కటే… మృగాళ్లకు మరణశిక్ష పడాలి.. అప్పుడే బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరుతుంది’ అని చెప్పింది. అంతకుముందు బాధితురాలి మరణంపై ప్రియాంకా గాంధీ విచారం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా, ఉన్నావో‌కు చెందిన ఆ యువతిపై గతేడాది పెళ్లి పేరుతో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మృగాడు బెయిల్ పై బయటకు వచ్చాడు. గురువారం ఉదయం కోర్టు విచారణ నిమిత్తం బాధితురాలు ఒంటరిగా బయలుదేరింది. ఆ సమయంలో బాధితురాలిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి ఒంటికి నిప్పంటించడంతో, ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఆసపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/