అన్నాచెల్లెళ్లు ఆ రాష్ట్రలో ఎందుకు ప్రచారం చేయడం లేదు

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజను మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పించారు. బిజెపి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పోరాడుతున్న రాష్ట్రాల్లోనే ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. ఆమె సమయాన్ని వృథా చేస్తున్నారు. ఆమె రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎందుకు ప్రచారం చేయట్లేదు. ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీఎస్పీలకు, దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బిజెపి తో నేరుగా తమ పార్టీకి పోటీ ఉన్న రాష్ట్రాల్లో ఆ అన్నాచెల్లెళ్లు (రాహుల్‌ గాంధీ, ప్రియాంక) దృష్టి పెట్టట్లేదు అని వ్యాఖ్యానించారు. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఢిల్లీ లో పర్యటిస్తున్న ప్రియాంక.. కాంగ్రెస్‌ తరఫున ఇటీవల పలు ర్యాలీల్లో పాల్గొన్నారు


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/