కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళులు

వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం

Ramnath Kovind
Ramnath Kovind

ఢిల్లీ : కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించి శుక్రవారం నాటికి 20ఏళ్లు పూర్తయింది. కార్గిల్ విజయాన్ని పురస్కరించుకుని ప్రతియేడు జులై 26న కార్గిల్ దివస్ ను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. కార్గిల్ అమరవీరుల త్యాగాలను భారత్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం అమరులైన సైనికుల కుటుంబాలకు భారత్ ప్రభుత్వం, ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. కార్గిల్ అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం నివాళులు అర్పించారు. 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత సైనికులను కలిచి, వారికి సంఘీభావం తెలిపే అదృష్టం తనకు కలిగిందని ఆయన పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలను అర్పించిన నాటి వీరులందరికీ వినయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద దేశ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమరవీరులకు నివాళులర్పించారు. సైనిక ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు సైతం స్మారకం వద్ద నివాళులు అర్పించారు.


తాజా ఆంధ్రప్రదేశ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/