ప్రణబ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్న వైద్యులు

Pranab Mukherjee

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రణబ్ దాదా ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని… ఇప్పటి వరకు ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యంగా బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీకి మెదడులో ఏర్పడిన కణితిని తొలగించేందుకు ఈ నెల 10వ తేదీన ఆపరేషన్ నిర్వహించారు. మరోపక్క కరోనా కూడా సోకింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సర్వత్ర ఆందోళన నెలకొంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/