ఎన్నికల్లో సమర్థుడైన నామకుడిని ఎన్నుకొవాలి

Prakash Raj
Prakash Raj

బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఈరోజు బెంగళూరు సెంట్ర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తాను ఎవరికి వ్యతిరేకంగా పోరాడటం లేదని, ప్రజల కోసమే తన పోరాటమని ఆయన అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరికి మెజారిటీ వస్తే వారే విజేతలని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు (ఓటర్లు)సరైన నాయకుడిని ఎన్నుకుంటే, అది ప్రజల విజయం. ఒకవేళ అసమర్థుడైన నాయకుడిని ఎన్నుకుంటే అది ప్రజల వైఫల్యమేనని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/