దేశంలో పెరుగుతున్న కాలుష్య నగరాలు

polluted cities in India
polluted cities in India

న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య నగరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది, అయితే ఢిల్లీయే కాకుండా ఉత్తర భారతదేశంలో మరికొన్ని కాలుష్య నగరాలు కూడా ఉన్నయని ఐఐటీకాన్పూర్, శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి.ఇందులో బీహార్ రాజధాని పాట్నా తొలి స్థానంలో ఉండగా.. యూపీలోని కాన్పూర్, ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గం వారణాసి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అసలు అన్నింటికన్నా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. గతేడాది చైనా కంటే ఇండియాలోనే 50 శాతం ఎక్కువ కాలుష్యం నమోదవడం. అక్టోబర్నవంబర్ మధ్య 45 రోజులపాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఈ మూడు నగరాల్లో 31 రోజుల పాటు తీవ్రమైన వాయు కాలుష్యం నమోదైనట్లు గుర్తించారు. గాల్లో పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5గా నమోదైంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే స్థాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.