దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్‌

Polling
Polling

న్యూఢిల్లీ : నేడు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్‌ కొనసాగుతుంది. ఏపి, తెలంగాణ సహా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 90ఏళ్లు పైబడిన వయోవృద్ధులు సైతం కుటుంబసభ్యుల సాయంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి. ఆంధ్రపదేశ్‌లో 24, తెలంగాణలో 17, ఉత్తరాఖండ్‌లో 5, ఉత్తరప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 7, బిహార్‌లో 6, అసోంలో 5, ఒడిశాలో 4, జమ్ముకశ్మీర్‌లో 2, పశ్చిమబెంగాల్‌లో 2, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 2, మేఘాలయలో 2, మిజోరం, త్రిపుర, మణిపూర్‌, నాగాలాండ్‌, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌, అండమాన్‌ నికోబార్‌, లక్ష్యద్వీప్‌లలోని ఏకైక లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ కొనసాగుతోంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/