గంగా సమ్మేళన్‌కు వెళ్లనున్న ప్రధాని మోడి

modi
modi

కాన్సూర్‌: గంగానది ప్రక్షాళనలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉత్తరాఖండ్‌లోని గోముఖ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌ వరకు గంగా సమ్మేళన్‌ కార్యక్రమాని నిర్వహించానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడి పాల్గొనన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాన్పూర్‌ ఐఐటీలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఇంకా తేదీ ఖరారు కాకపోయినా సన్నాహక ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. ఇటీవల జిల్లా మెజిస్ట్రేట్ విజయ్‌ విశ్వాస్‌ పంత్‌ కాన్పూర్‌ ఐఐటీని సందర్శించి ప్రధాని మోడి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. గంగానది ప్రవహించే ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించి గంగానది కాలుష్యం నుంచి విముక్తి కల్పించే విషయమై చర్చించనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/