ఆయన ప్రకటనల కోసం 3044 కోట్లు ఖర్చు చేశారు

Mayawati
Mayawati

లఖ్‌నవూ: ప్రధాని నరేంద్రమోడిపై బీఎస్పీ నేత మాయావతి ఆరోపణలు చేరశారు. మోడి ప్రచారం కోసం దాదాపు 3044కోట్లు ఖర్చు చేసినట్లు ఆమె ఆరోపించారు. మోడి శంకుస్థాప‌న‌లు, ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల‌పైనే ఆమె అన్నారు. ఈసందర్భంగా ఆమె తన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. మోడి ప్రచారం కోసం పెట్టిన ఖ‌ర్చును పేద రాష్ట్రాల‌కు ఖ‌ర్చు చేస్తే ఆ రాష్ట్రాలు బాగుప‌డేవ‌న్నారు. వెనుక‌బ‌డిన యూపీ రాష్ట్రానికి ఆ నిధులు ఇస్తే, ఇక్క‌డ విద్యా, హాస్ప‌ట‌ళ్ల‌ను నిర్మించేవాళ్ల‌మ‌న్నారు. పేద‌రికం, నిరుద్యోగం లాంటి అంశాల‌ను ప్ర‌జ‌లు మ‌రిచిపోయేలా మోదీ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎస్పీ,బీఎస్పీలు క‌లిసి పోటీ చేయ‌నున్నాయి. యూపీలో మొత్తం ఏడు ద‌శ‌ల్లోనూ పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/