లక్ష్యం పెద్దగా ఉంటేనే ప్రయోజనాలు అదే స్థాయిలో వస్తాయి

Modi
Modi

వారణాసి: ప్రధాని నరేంద్రమోడి శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని వారణాసి నుండి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడి మాట్లాడుత కేంద్ర బడ్జెట్‌ గురించి ప్రస్తావించారు.


5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొందరు ఈ లక్ష్యాన్ని సాధించే మార్గాలు చెప్పకుండా విమర్శలు చేస్తున్నారు. అలాంటి వృతిపరమైన నిరాశావాదులతో జాగ్రత్తగా ఉండండి. లక్ష్యం పెద్దగా ఉంటేనే ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో వస్తాయి అనిమోడి తెలిపారు. ఎందుకు మనం పెద్ద కలలు కనకూడదు.. మనల్ని మనం పేదవాళ్లమని ఎందుకు అనుకోవాలి అని మోడి ప్రశ్నించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/