అద్వానీకి శుభాకాంక్షల వెల్లువ

92వ వసంతంలోకి అడుగుపెట్టిన అద్వానీ

న్యూఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఈ రోజు 92వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఉదయం అద్వానీ నివాసానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడి, కేంద్ర మంత్రి అమిత్‌ షా, బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కాసేపు మాట్లాడారు. అద్వానీ ఓ రాజనీతిజ్ఞుడు, దేశ దార్శనికుడు అని మోడి ఈ సందర్భంగా అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలు సాధికారత సాధించడంలో ఆయన అందించిన సహకారం అసాధారణమని తెలిపారు. అద్వానీకి బిజెపి పార్టీ సీనియర్లతో పాటు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/