లోక్‌పాల్‌ ఛైర్మన్‌గా పినాకిచంద్రఘోష్‌!

Pinaki Chandra Ghose
Pinaki Chandra Ghose

న్యూఢిల్లీ,: స్వాతంత్య్రం వచ్చినతర్వాత మొట్టమొదటిసారిగా భారత్‌లో జాతీయ స్థాయిలో అవినీతి నిరోధానికి ఒక జాతీయ సంస్థ ఆవిర్భవించింది. లోక్‌పాల్‌ వ్యవస్థకు ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకిచంద్రఘోష్‌ను ఎంపికచేసారు. మొట్టమొదటి లోక్‌పాల్‌ ఛైర్మన్‌గా ఆయన పేరును ఎంపిక ప్యానెల్‌ ఖరారుచేసింది. జస్టిస్‌ఘోష్‌ 2017 మేనెలలోనే సుప్రీం న్యాయమూర్తిగా రిటైర్‌ అయ్యారు. అవినీతినిరోధకవ్యవస్థకు అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తారని అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ మానవహక్కుల కమిషన్‌కు సభ్యునిగా కూడా ఘోష్‌ వ్యవహరిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అద్యక్షతన ఉన్న కమిటీ ఆయన పేరును మాత్రమే పరిశీలిస్తోంది. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన ప్రభుత్వంనుంచి మాత్రం రాలేదు. ప్రభుత్వం ఆయన్నే నియమిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ఖర్గేమరోసారి ధ్వజమెత్తె అవకాశం ఉంది. ఎంపిక కమిటీ సమావేశాలకు ఆయన హాజరుకాని సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన సమావేశానికిసైతం ఆయన రాలేదు. లోక్‌పాల్‌చట్టంక్రారంచూస్తే జాతీయ స్థాయిలో లోక్‌పాల్‌, రాష్ట్రస్థాయిలో లోకాయుక్తలుఅవినీతి నిరోధకవ్యవస్థలకు సంబంధించి కట్టడిచేసేందుకుపనిచేస్తాయి. ఈ బిల్లును 2013లోనే ప్రభుత్వం ఆమోదించినప్పటికీ ఇప్పటికీ అమలుకురాలేదు. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే సైతం లోక్‌పాల్‌ నియామకంపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, జాప్యంపై నిరసన వ్యక్తంచేస్తూ నిరవధిక దీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై వెల్లువెత్తే అవినీతి ఆరోపణనలనుసైతం లోక్‌పాల్‌, లోకాయుక్తపరిధిలోనికి తెచ్చారు.
జస్టిస్‌గోష్‌ నియామకం లోక్‌పాల్‌ చట్టం అమలుకు వచ్చిన ఐదేళ్ల తర్వాత జరిగింది. 2014 జనవరి 16వ తేదీ లోక్‌పాల్‌ బిల్లుకు ఆమోదం లభించింది. లోక్‌పాల్‌ కేంద్రంలోను, లోకాయుక్త రాష్ట్రాల్లోను ప్రభుత్వ ఉద్యోగులపై వెల్లువెత్తిన అవినీతిపై విచారణచేస్తారు. సుప్రీంకోర్టులో దాఖలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సైతం విచారణకు వచ్చింది. ఎన్‌జిఒ కామన్‌కాజ్‌ కేసులో న్యాయవాదిప్రశాంత్‌భూషణ్‌ ఈ కేసు తరపున వాదిస్తున్నారు. ప్రభుత్వం లోక్‌పాల్‌ను సాధ్యమైనంత సత్వరమే నియామకాలు చేపట్టాలని, ఇప్పటికే సమయం వృధా అయిందని అన్నారు. కొంతమేర జాప్యంజరిగిన తర్వాత ఎంపిక కమిటీని 2018 సెప్టెంబరు 27వ తేదీ నియమించారు. సుప్రీంకోర్టు జోక్యంచేసుకున్న తర్వాత మాజీ సుప్రీం న్యాయమూర్తి రంజనా ప్రకాష్‌ దేశాయి ఆధ్వర్యంలోకమిటీ ఏర్పాటయింది. జస్టిస్‌ పిసిఘోష్‌ పేరును ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎంపికచేసినట్లు తేలింది. లోక్‌సభలో ఇప్పటివరకూ ప్రతిపక్ష హోదా లేనినాయకులు డేకపోవడంతోప్రభుత్వం కాంగ్రెస్‌నుంచి మల్లిఖారుజన్‌ ఖర్గేను లోక్‌సభాపక్ష నేతగా ప్రత్యేక ఆహ్వానితునిగా ఆహ్వానిస్తూ వచ్చింది. తనకు ఈ విధామైన ఆహ్వానం అందుతున్నందున రాలేనని, ప్రతిపక్ష నేత హోదాలో అహ్వానం అందితేనే హాజరుకాగలనని స్పష్టంచేసారు. చట్టంలో సరైన మార్పులు జరిగితేనే రాగలనని స్పష్టంచేసారు. మోడీప్రభుత్వం లోక్‌పాల్‌ చట్టాన్ని సవరించి లోక్‌పాల్‌ ఎంపిక విదానంలోప్రతిపక్షం కూడా భాగస్వామి అయ్యేటట్లు సవరిస్తే తప్ప పార్టీనేతగా హాజరుకాలేనని చెప్పారు.

https://www.vaartha.com/news/national/
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి :