హింసాత్మక ఘటనలు దేశానికి ప్రమాదం

shiv sena
shiv sena

ముంబై: ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని శివసేన జోస్యం చెప్పింది. అమిత్‌ షా నేపథ్యంలో కోల్‌కత్తాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
సీనియర్‌ నేతలు ఎవరూ తమ రాష్ట్రంలోకి రావడానికి ఆమె (మమతా బెనర్జీ) ఒప్పుకోవట్లేదు. హింసాత్మక ఘటనలు జరిగేలా చేస్తూ పశ్చిమబెంగాల్‌ను ఆమె యుద్ధ క్షేత్రంలా మార్చేశారు. మోదితో పాటు అమిత్‌షాను, యుపి సియం యోగి ఆదిత్యనాథ్‌ను ఆమె వ్యతిరేకించని రోజు లేదు. ఇంతకు ముందు ఆ రాష్ట్రంలో సిపిఎం హింసను ప్రోత్సహించింది. ఆ పార్టీని ప్రజలు అధికారంలోంచి దించేశారు. ఇప్పడు మమత వంతు వచ్చింది. ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకకోవడం దేశానికి ప్రమాదం అని పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/