చైనాలాగే భారత్‌ కూడా అభివృద్ధి చెందుతుంది

S Jaishankar
S Jaishankar

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఓ సెమినార్‌లో కేంద్ర విదేశాంగ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ .జయ్‌శంకర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు గడిచిన ఐదేళ్లలో ప్రపంచంలో భారత స్థాయి వృద్ధి చెందినట్లు దేశంలోని మెజార్టీ ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. అంతర్జాతీయ సమతుల్యం జరుగుతోంది. చైనా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో భారత్‌ కూడా అంతే వేగంగా ముందుకెళ్తోంది. మార్పుపై అంచనాలను ప్రభుత్వం సజీవంగా ఉంచడమేగాక ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తోంది. ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించాలంటే భారత్‌ విదేశాంగ విధానాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది అని జయ్‌శంకర్‌ అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/