సిఎంకు జరిమానా విధించండి : కిరణ్‌ బేడీ

kiranbedi
kiranbedi

పుదుచ్చేరి: ట్రాఫిక్‌ రూల్స్‌ సామాన్యులకు మాత్రమే కాదు, ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుందంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ అన్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపిన నారాయణస్వామికి జరిమానా విధించాలంటూ కిరణ్‌బేడీ డిజిపిని ఆదేశించారు. ఎన్నికల ర్యాలీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రి హెల్మెట్‌ పెట్టుకోకుండా బైక్‌ నడిపిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ట్రాఫిక్‌ రూల్స్‌ సామాన్యులకేనా, ముఖ్యమంత్రికి వర్తించవా అంటూ నెటిజన్టు స్పందించారు. దాంతో సిఎంకు జరిమానా విధించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ఆదేశించారు. ముఖ్యమంత్రి నారాయణస్వామి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీలమధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో ఇద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలను చేసుకుంటున్నారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/