ట్రక్కుకు రూ.6.53లక్షల జరిమానా

truck
truck


భువనేశ్వర్‌: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘింస్తున్నరంటూ భారీగా పెంచిన జరిమానాలతో వాహనదారులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఢిల్లీలో ఓవర్‌లోడ్‌తో వెళుతున్న ఒక ట్రక్కుకు ట్రాఫిక్‌ అధికారులు రూ.2 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఇది దేశంలోనే అత్యంత భారీ జరిమానాగా రికార్డులకెక్కింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరొకటి వెలుగులోకి వచ్చింది. నాగాలాండ్‌కు చెందిన (ఎన్‌ఎల్‌-0807079) ట్రక్కుకు ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ట్రాన్స్‌పోర్టు అధికారులు రూ.6,53,100 జరిమానా విధించారు. ఈ ట్రక్కు మొత్తం ఏడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించిందుకు గాను ఇంత భారీ జరిమానా విధించినట్లు చెప్పారు. ట్రాఫిక్‌ చలానాల్లో దేశంలోనే ఇది ఆల్‌టైమ్‌ రికార్డుగా నిలిచిందంటున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/