ఏపి ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కావాలి

Mayawati , Pawan kalyan
Mayawati , Pawan kalyan

లక్నో: బీఎస్పీ అధినేత్ర మాయావతితో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లక్నోలో ఈరోజు సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే భేటి తరువాత మాయావతి మీడియాతో మాట్లాడుతు ఏపి ముఖ్యమంత్రి కావాలన్నది తన అభిమతమని ఆమె అన్నారు. ఏపి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కొత్త ప్రభుత్వం రావాలనుకుంటున్నారన్నారు. ఏపీ, తెలంగాణలో జనసేన, మిగిలిన వాపక్షాలతో కలిసి పోటీ చేస్తామన్నారు. సీట్ల పంపకంపై ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఏప్రిల్ 3, 4 తేదీలలో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. దేశంలో మిగిలిన పక్షాల కంటే తమ పక్షమే చాలా ముందున్నదని మాయావతి తెలిపారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/