పనాజీలోని బిజెపి కార్యాలయంలో పారికర్‌ పార్ధవదేహాం

Manohar Parrikar
Manohar Parrikar

పనాజీ: గతకొంతకాలంగా క్లోమగ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న గోవా సిఎం మనోహర్‌ పారికర్‌ ఆదివారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర హోంశాఖ… రక్షణశాఖను కోరింది. మిరామర్‌ బీచ్‌లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్‌ బండోద్కర్‌ స్మారకం పక్కనే పారికర్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు. మనోహర్‌ పారికర్‌ పార్థివదేహాన్ని ప్రస్తుతం పనాజీలోని భాజపా కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్టీ నేతలు నివాళులర్పించిన అనంతరం ప్రజల సందర్శనార్థం పారికర్‌ భౌతికకాయాన్ని కాలా అకాడమీకి తరలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పారికర్‌ అంతిమయాత్ర ప్రారంభమవుతుందని భాజపా నేతలు తెలిపారు. 5 గంటలకు మిరామర్‌ బీచ్‌లో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పారికర్‌ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/